ఈ నెలాఖరు లోపు వడ్డీ లేకుండా పన్నులు చెల్లించవచ్చు

- Advertisement -

ఈ నెలాఖరు లోపు వడ్డీ లేకుండా పన్నులు చెల్లించవచ్చు

Taxes can be paid without interest before the end of this month

పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి

బద్వేలు మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహరెడ్డి

బద్వేలు
బద్వేలు పురపాలక సంఘంలో  పన్నులు వసూలు చేయు సిబ్బందితో  మునిసిపల్ కమీషనర్ వి.వి.నరసింహ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు పన్నులు చెల్లించినట్లతే వడ్డీ లేకుండా పన్నులు చెల్లించవచ్చు.పన్నులు వసూలు చేయు సిబ్బంది కూడా ఈ నెల ఆఖరు లోపు వడ్డీ లేకుండా పన్నులు చెల్లించవచ్చు అనే విషయాన్ని  ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
డిసెంబర్ తరువాత నుండి వడ్డీతో చెల్లించ వలసి వుంటుంది కావున పన్ను బకాయిదారులందరు కూడా   అన్నీ రకాల పన్నులు ఈ నెలాఖరు లోగా తప్పక చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి.
అన్ని సచివాలయాలలో  పన్నుల వసూళ్లు కొరకు కౌంటర్లు ఏర్పాటు చేయడము జరిగింది.
అంతే కాకుండా ఆన్లైన్ మరియు ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు.
సమీక్షా సమావేశంలో కమీషనర్ తో పాటు మునిసిపల్  రెవిన్యూ ఆఫీసర్ రఘునాథరెడ్డి ,రెవెన్యు ఇన్స్పెక్టర్ షఫీ పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular