- Advertisement -
టీడీపీ బీసీ డిక్లరేషన్ కమిటీ భేటీ
తాడేపల్లి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చ జరిగింది. యనమల మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ వుంటుంది. జగన్ చేసిన మోసం నుండి కోలుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యం. మంగళవారం నాగార్జున యూనివర్సిటి ఎదురుగా భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
- Advertisement -