పులువెందులలో కుడా టీడీపీ గెలవబోతోంది
విజయవాడ
కంచికచర్ల మండలంలో టిడిపి నాయకులు కేశినేని శివనాద్ (చిన్ని) పర్యటిస్తున్నారు. కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వౌమ్యకి భారీ ర్యాలీ లతో టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పెండ్యాల గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కంచికచర్ల మండల కీసర,పెండ్యాల,వేములపల్లి అమరవరం గ్రామాలలో కేశినేని చిన్ని పర్యటించారు.
చిన్ని మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇచ్చి అందరూ మోసపోయాం. నందిగామలో ఇద్దరు సైకోలతో పాటు మూడో సైకో కూడా బయలుదేరాడు. నందిగామలో తంగిరాల సౌమ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి . వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. 175 స్థానాలకు గాను జనసేన, టిడిపి 160 స్థానాల్లో గెలవబోతోంది. పులివెందులలో కూడా టిడిపి గెలవబోతుంది. ఇంకా ఎన్నికలకు మనకు 65 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగనంపాలనిఅన్నారు…
పులువెందులలో కుడా టీడీపీ గెలవబోతోంది
- Advertisement -
- Advertisement -