టీడీపీ-జనసేన తొలి జాబితా.. రియాక్షన్లు ఇదిగో ..
24 మందితో పవన్ యుద్ధమా?: సజ్జల సెటైర్లు
పవన్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది
24 మంది అభ్యర్థులతో వైఎస్సార్‌సీపీ మీద యుద్ధం చేస్తారా?
జనసేన మిగిలిన ప్లేస్‌ల్లోనూ టీడీపీవాళ్లే ఉంటారు
24 సీట్లలో కూడా పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించలేని స్టేజ్‌లో పవన్ ఉన్నాడు
రాష్ట్రాన్ని ఏం చేశారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు
పవన్ కంటే పవన్ అభిమానుల్ని చూస్తే జాలేస్తోంది
ఆశించిన సీట్లు రావనే చంద్రబాబు
డ్రామాలాడుతున్నారు
బీజేపీ పొత్తు కోసమే ఇదంతా
ఎక్కడ పోటీ చేయాలో పవన్ నిర్ణయించుకోలేకపోతున్నాడా ?
టీడీపీకి పవన్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుంది
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు
► మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులే దొరకడం లేదు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
👉 ఏపీలో టీడీపీ-జనసేన కూటమిలో భాగంగా నేడు తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఇక, ఏపీలో 175 స్థానాలకు గాను 24 స్థానాలను, మూడు పార్లమెంట్ స్థానాలను జనసేనకు కేటాయించారు. మరోవైపు.. తొలి జాబితాలో టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది .
అయితే, మాకు అధికారం కావాలి.. నేను సీఎంను అవుతాను.. ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కేవలం 24 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యాడు. చంద్రబాబు పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కేవలం 24 సీట్లకే జనసేనను పరిమితం చేశాడు. దీంతో, పవన్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక, టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై వైఎస్సార్‌సీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. పవన్ 24 సీట్లకే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు .
► విజయవాడలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనది పొత్తు కాదు ప్యాకేజీ ఒప్పందం. ప్యాకేజీ కోసం పవన్.. చంద్రబాబుకి అమ్ముడుపోయాడు. ఉండవల్లి శ్రీదేవి.. నమ్మకం ద్రోహం చేస్తూ పార్టీ మారింది. ఇప్పుడు దేవుడు ఆమెకి సీటు లేకుండా చేశాడు. చంద్రబాబు మోసానికి ప్రతిరూపం. చంద్రబాబు ఎందుకు అభ్యర్థులను పక్క జిల్లాల నుండి తెచ్చారు .
► పవన్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు.. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు. ఛీ.. పవన్ అంటూ కామెంట్స్.
► టీడీపీ-జనసేన సీట్ల పంపకాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి సెటైరికల్ కామెంట్స్. వెల్లంపల్లి మాట్లాడుతూ.. జనసేనకు అభ్యర్థులే దొరకడం లేదు. బీజేపీతో పొత్తుపై ఇద్దరూ తలోమాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు మరోసారి వంగవీటి రాధాను మోసం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఈసారి 175 సీట్లు పక్కా వస్తాయి.
► కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారాడు. కాపులకు పవన్ వెన్నుపోటు పొడిచారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారు. టీడీపీ అంతం వంగవీటి రంగా ఆశయం. రంగా ఫ్యామిలీని కూడా చంద్రబాబు మోసం చేశాడు.