10 C
New York
Thursday, April 18, 2024

స్మశాన వాటికలో టీజర్ లాంచ్..

- Advertisement -

స్మశాన వాటికలో టీజర్ లాంచ్.. మీది మామూలు గుండె కాదు సామి!

తమ సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసం మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ హారర్ మూవీ టీం.. టీజర్ లాంచ్ ఈవెంట్ ని ఏకంగా స్మశాన వాటికలో చేయనుండటం సంచలనంగా మారింది.

ప్రముఖ నటి అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజ‌లి’.. 2014 ఆగస్టులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి ‘గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది’ అనే టైటిల్ తో రాబోతుంది. అయితే ఈ మూవీ టీజర్ లాంచ్ ని చిత్రబృందం వినూత్నంగా ప్లాన్ చేసింది. “ఈ శనివారం(ఫిబ్రవరి 24) రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్” అంటూ ప్రకటించింది. మామూలుగా స్మశానం వైపు వెళ్ళడానికే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది స్మశానంలో సినిమా ఈవెంట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరొస్తారు? మూవీ టీం అంతా భయపడకుండా ఈవెంట్ కి వస్తారా? అని చర్చలు మొదలయ్యాయి.

‘గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది’ అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్ల‌పాటి దర్శకుడు. కోన వెంక‌ట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ బ్యానర్స్ పై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అంజ‌లితో పాటు శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్, రాహుల్ మాధ‌వ్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్‌ కథ అందిసున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, సినిమాటోగ్రాఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ గా చోటా కె ప్ర‌సాద్‌ వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!