ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయమవుతున్న‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ – నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి ఆయన బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. మీ టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ – ఆర్కే టెలీ షో పాతికేళ్లు పూర్తయిన తెలిసినప్పుడు ఆనందపడ్డాను. ఈ సంస్థ ద్వారానే మేము శాంతినివాసం సీరియల్ నిర్మాణం ప్రారంభించాం. ఆ తర్వాత ఆర్కే టెలీ షో ఇచ్చిన ఎక్సీపిరియన్స్ తో ఆర్కా మీడియా స్థాపించాం. రాఘవేంద్రరావు గారికి, మాధవి, పద్మజ,మిగిలిన టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.