సూర్యాపేట /ఖమ్మం :సెప్టెంబర్ 11(వాయిస్ టుడే ప్రతినిధి). మున్నూరు కాపు ముద్దుబిడ్డ, టి పి సి సి మాజీ కార్యవర్గ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఖమ్మం మాజీ కౌన్సిలర్ తంజావూరు విజయలక్ష్మి మృతి, మున్నూరు కాపు సంఘానికి కుటుంబానికి తీరనిలోటని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు , మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుఏనుగుల వీరాంజనేయులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, దేవేందర్ , తోట వెంకటేశ్వర్లు ,మూగాల బిక్షపతిఅన్నారు. సోమవారం రోటరీ నగర్ లో ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



