Thursday, February 19, 2026

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు:
బడ్జెట్ ఎప్పుడంటే!

Telangana Assembly sessions from 26th of this month

హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 28న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈసారి సభను 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు.
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక, ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్‌లో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్