దుబాయ్ లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ సంబరాలు
జగిత్యాల, జూన్ 11
దుబాయ్ లోని ఏటిసాలట్ అకాడమీలో
స్పార్క్ మీడియా ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆది,సోమ వారాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ హజరై
తెలంగాణ ప్రకాష్, డైరెక్టర్ వినయ్ బాబు, నంగి దేవెందర్ లతో కలసి
తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా
తెలంగాణ కళాకారులు సోనీ యాడర్ల, లల్లయిలే మహేష్, మా పల్లె శంకర్ మరియు దుబాయ్ సింగర్ మల్లేష్ కోరేపుల ఉద్యమ పాటలతో సందడి చేశారు…అనంతరం అందే శ్రీ, దుబాయ్ తెలుగు సంఘాల పెద్దలు, వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానం చేశారు.
కార్యక్రమానికి సహకారం అందించిన స్పాన్సర్స్ కి తోపాటు అతిథులకు, కళాకారులకు ప్రేక్షకులకు స్పార్క్ మీడియా అరుణ్ సుర్నిడ, రమేష్ లావణ్య లు కృతజ్ఞతలు తెలిపారు.



