- Advertisement -
తెలంగాణ గవర్నర్ రాజీనామా…🖊️
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత రాష్ట్రం అయిన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్ సభకు పోటీ చేయటానికి లైన్ క్లియర్ కావటంతో.. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
- Advertisement -