తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

- Advertisement -

 తెలంగాణ ప్రభుత్వ
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

జయశంకర్ భూపాలపల్లి,

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మంగళ వారం  హాకింపేట, కరీంనగర్, ఆదిలాబాద్  క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవిస్కరించారు.
28వ తేదీన జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థిని, విద్యార్థుల ఎంపిక వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 28వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఎంపికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా క్రీడల అధికారిని ఆదేశించారు.  ఇతర వివరాలకు  9618022096, 8328577652 నంబర్లును సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన,  క్రీడల అధికారి సిహెచ్ రఘు, విద్యాశాఖ అధికారి ఎన్ రాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular