మంత్రి హరీష్ రావు
మల్కాజ్ గిరి: మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి, మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ జరగనుంది. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపిగా ఓడినా ప్రజాసేవ మరచిపోలేదు. 9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. సీఎం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నడు. ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు. కేసీఆర్ ఓట్ల కోసం చెప్పలేదు. ప్రతి పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చారు. కర్ణాటకలో కరెంట్ కోతలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారింది. నాడు బెంగాల్ ఆచరిస్తే దేశం అనుసరించేది. నేడు తెలంగాణ మోడల్ అయ్యింది. రాహుల్ గాంధీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోతున్నాడు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ అయినా ఉన్నాయా అని అడిగారు.
కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు పోదాం పద సర్కారు దవాఖాన అని మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం, 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నరు. అందులోనే 250 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి ఉంటుంది. అల్వాల్ లో కార్పొరేట్ వైద్య సేవలు అందనున్నాయి. కెసిఆర్ ప్రేమ గుణం ఉంది. అంతే గానీ పగ గుణం లేదు. 28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి. నేను దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని అన్నారు.

ఏ సర్వే చూసినా 75 నుండి 80 సీట్లతో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అని. కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలి. కేసీఆర్ అంటే ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉండాలా, గుండాలు, దొంగలు, ముఠాల చేతుల్లో ఉండాలా అని ప్రశ్నించారు. సన్నీ డియోల్, రజినీ కాంత్ హైద్రాబాద్ వచ్చి ఇక్కడి అభివృద్ది ని మెచ్చుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజినిలకు అర్థం అయ్యింది కానీ కాంగ్రెస్ గజినిలకు అర్థం కావడం లేదు. కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంది. అద్భుతమైన మేనిఫెస్టో మనది ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ నా బిడ్డలు అని బావించే గొప్ప నాయకులు కేసీఆర్. మర్రి రాజశేఖర్ రెడ్డి ని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని ముగించారు.




