మిడియేషన్ లో శిక్షణ పోందిన కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాదుల కు సర్టిఫికెట్లు అందించిన తెలంగాణ హై కోర్టు జడ్జిలు..
Telangana High Court Judges gave certificates to Kothagudem district court lawyers for training in mediation. ట్రైని మిడియేటర్స్ గా అడపాల పార్వతి, మహమ్మద్ సాదిక్ పాషా..
భారత సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మిడియేషన్ & ఆర్బిటేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని తెలంగాణ జూడిషియల్ అకాడమీ లో జరిగిన ఐదు రోజుల ట్రైనింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నుండి ప్రాతినిధ్యం వహించి మిడియేషన్ లో శిక్షణ పోందిన న్యాయవాదులు అడపాల పార్వతి, మహమ్మద్ సాదిక్ పాషా, లకు ట్రైనింగ్ అనంతరం జూడిషియల్ అకాడమీ లో జరిగిన కార్యక్రమంలో ట్రైని మిడియేటర్స్ గా సర్టిఫికెట్లు అందించిన తెలంగాణ జూడిషియల్ అకాడమీ ప్రసిడెంట్, హై కోర్టు జస్టిస్ పి.సామ్ కొశి, తెలంగాణ మిడియేషన్ మరియు ఆర్బిటేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు హైకోర్టు జస్టిస్ కే.లక్ష్మణ్ , తెలంగాణ మిడియేషన్ మరియు ఆర్బిటేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు హైకోర్టు జస్టిస్ జే. శ్రీనివాస్ రావు పాల్గొని సర్టిఫికెట్స్ అందజేశారు




