పరిహారం ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వండి
సిగాచి ప్రమాద బాధితుల పరిహారం
ప్రభుత్వం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్
Telangana High Court once again expresses impatience with the government
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం పై ప్రభుత్వం పై తెంలగాణ హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. పరిహారం ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వండని ఆదేశించింది. ఘటనలో మృతి చెందిన 56 మందికి, ఆచూకీ లభించని 8 మందికి, 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించడంతో పాటు, దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో బాబురావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారిస్తూ, పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబం ధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం అందాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసారు.



