Sunday, September 8, 2024

జై బోలో తెలంగాణ..  ప్రియాంక ప్రసంగం

- Advertisement -

ఖమ్మం, నవంబర్ 24, (వాయిస్ టుడే ): బోలో తెలంగాణ అని నినదించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామికి జై కొట్టారు ప్రియాంకా గాంధీ. ఝాన్సీ రెడ్డి కుటుంబం చాలా సేవాభావం గల కుటుంమని ఆమె వెల్లడించారు. రైతుల భూములు లాక్కునే కుటుంబం బీఆర్‌ఎస్ కుటుంబం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది అంటూ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు.. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. మీరు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయితే, పేపర్‌ లీకులు అవుతున్నాయని.. పేపర్‌ లీకులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యల కారణాలను కూడా ఈ ప్రభుత్వం వక్రీకరించిందని మండిపడ్డారు.పేపర్ లీకేజీల కుంభకోణాన్ని అరికట్టడానికి జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందన్నారు. మా అక్క చెల్లెళ్లకి క్షమాపణ చెప్తున్నా.. ఇంత సేపు నాకోసం అన్ని పనులు వదిలేసి వచ్చినందుకు అంటూ ప్రియాంక చమత్కరించారు. గ్రామ గ్రామాన వైన్స్, బెల్ట్ షాపులు అక్కా చెల్లెళ్ళ జీవితాలను పాడుచేస్తున్నాయన్నారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.

Telangana in Jai Bo.. Priyanka's speech
Telangana in Jai Bo.. Priyanka’s speech

మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు ప్రియాంకా గాంధీ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని ఆమె విమర్శించారు. రైతు సంపాదించిన భూములను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. రైతులకి కనీస మద్దతు ధర కచ్చితంగా ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ వచ్చి 10 సంవత్సరాలు గడిచినా అన్యాయమే జరుగుతోందని ప్రియాంక విమర్శించారు.మందులకి చివరి తేదీ ఎలా ఉంటాదో.. అలా బీఆర్‌ఎస్‌కు ఎక్సపైరీ తేదీ ఇప్పుడు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు మీ ఆలోచనలను మరిచి వాళ్ల కుటుంబ పాలన కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ఈ ప్రభుత్వం ఫామ్ హౌస్‌లకే పరిమితం అంటూ విమర్శించారు. దళితులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో చాలా లక్షల కోట్ల కుంభకోణం చేసి దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దొరల తెలంగాణ చేసిందని.. మేము వచ్చాక దొరల తెలంగాణని ప్రజల తెలంగాణ చేస్తామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్