తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియర్లో 60.01 శాతం, సెకండియర్లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లు అయిన https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.