శాంతి భద్రతలలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -

హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ

మానకొండూరు:  సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని  హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ పేర్కొన్నారు . కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల పాలనలో జరిగిన  అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ల్యాండ్ అండ్ ఆర్డర్  లో  దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తున్నామని..24 గంటల కరెంటు తో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి హామీలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మానకొండూర్ లో రసమయి బాలకిషన్ ను మరో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గట్టు దుద్దనపల్లి గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు 100 మంది బిఆర్ఎస్ లో చేరగా..  మహమ్మద్ అలీ చేతుల మీదుగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు,జడ్పిటిసి శేఖర్ గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్,  లలితాపూర్ సర్పంచ్ మర్రి కొండయ్య, దుద్దనపల్లి సర్పంచ్ దేవ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లి మురళి తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular