Friday, February 7, 2025

మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం,

- Advertisement -

మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం,

Telangana Legislature Condolences to Manmohan Singh

భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం

హైదరాబాద్:
భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేశారు. కేంద్రానికి ఆ ప్రతిపాదనలు పంపనున్నారు. ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారుపీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ దశ దిశను మార్చింది. మన్మోహన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి పాటిస్తున్నాం. నేడు దివంగత ప్రధానికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇదివరకే మన్మోహన్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి అమలు చేస్తోంది. సంతాప దినాలలోనే మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపి, శాసనసభ వేదికగా ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టాలు మన్మోహన్ ఘనతే. దేశ గొప్ప తత్వవేత్తను కోల్పోయింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్థికవేత్త, మానవతావాది మన్మోహన్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా విశేష సేవలు అందించారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. ఐటీలో నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందంటే అందుకు మన్మోహన్ నిర్ణయాలే కారణం.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రతిపాదన చేసింది. మన్మోహన్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఎన్ని విమర్శలు వచ్చినా తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే మన్మోహన్ ఫోకస్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు ఎంపీగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. జీవిత కాలం మాకు గుర్తుండిపోయే సంఘటన అది. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించారు.
ప్రతిపక్షాల మద్దతు ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ సంతాపం తెలిపింది. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని భట్టి కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మన్మోహన్ లాంటి గొప్ప ఆర్థికవేత్త, మానవతావాదికి భారతరత్న ఇవ్వాలన్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ గొప్పతనం, ఆయన సామర్థ్యాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కేటీఆర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయిందన్నారు. గొప్ప ఆలోచనలు ఉన్నవారిని అరుదైన సందర్భం వస్తే ప్రపంచలో ఏ శక్తి ఆపలేదన్నారు.మాజీ ప్రధాని మన్మోహన్ గారికికి నివాళులు అర్పిస్తున్నాం, ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ తరఫున ప్రగాఢ సానుభూతి. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ని ప్రభుత్వం లోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఆర్బిఐలో పనిచేసిన మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా నియమించారు. భారతదేశం గురించి ప్రపంచం  వినాల్సి వస్తుందని తన తొలి బడ్జెట్ ప్రసంగంలో భారత దేశ స్థితిగతులను 1991 లో మన్మోహన్ సింగ్ చెప్పారు. అన్నట్లుగానే అనేక సంస్కరణలను సాధించింది భారతదేశం. నిబద్ధత అనేది రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి పర్యాయపదం మన్మోహన్ సింగ్. తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు సేవ చేశారు. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచారు, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్.. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. శాఖల కేటాయింపులు వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ తన షిప్పింగ్ శాఖను డిఏంకె పార్టీకి వదులుకున్నారు. తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ కేసీఆర్ స్వయంగా మన్మోహన్ గారికి చెప్పారు. తెలంగాణ కోసం ఆరోజు ఇచ్చిన ఈ పోర్ట్ఫోలియో తెలంగాణ కోసం కేసీఆర్ ను ఒక ఖర్మయోగిగా మారుస్తుందని మన్మోహన్ అన్నారు.  తెలంగాణ కల సాకరమయ్యే రోజు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. డిసెంబర్ 18, 2004లో ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ నుంచి ఒక ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి ఓబీసీల డెలిగేషన్ తీసుకువస్తున్నామని చెప్పారు. కేవలం ఐ5 నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరితే మన్మోహన్ అంగీకరించారు. ఓబీసీల సమస్యల పైన కెసిఆర్, ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం ప్రతినిధి బృందానికి దాదాపు గంటన్నర పాటు అన్ని అంశాలను తెలిపారు.
ఢిల్లీలో పీవీకి మెమోరియల్ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్
మన్మోహన్ సింగ్ సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు. అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చారు. ఎన్ని నిందలు వేసిన సంస్కరణలను అద్భుతంగా తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు పార్టీ బృందం హాజరై నివాళులు అర్పించాం. మన్మోహన్ సింగ్ కి హైదరాబాదులో విగ్రహం ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సహకారం అందిస్తాం. మన్మోహన్ సింగ్‌ను రాజకీయాలకు తీసుకొచ్చిన పీవీ నరసింహారావుకు ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ప్రధానులందరికీ దేశ రాజధాని ఢిల్లీలో మెమోరియల్ ఉంది కానీ పివికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో పీవీకి మెమోరియల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.  మెమోరియల్ ఎర్పాటు కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే బాగుంటుంది. మన్మోహన్ గారికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాం’ అన్నారు కేటీఆర్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్