Wednesday, March 25, 2026

పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరె

- Advertisement -

పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్

*నిజామాబాద్ జిల్లా సెప్టెంబర్26*

Telangana Mahalakshmi playing poker

పురుషులకు దీటుగా మహిళలు మేమెందులో తక్కువ అన్నట్టుగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా మణులు.. ఇప్పుడు పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పేకాట ఆడుతున్న నలుగురు ఆడవాళ్లను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాలుగవ అంతస్తులో బుద్ధినేని గోదాదేవి, అనే మహిళ ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్నట్టుగా తెలిసింది. పేకాట ఆడుతున్న మహి ళలను పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా, పోలీసులకు పట్టు బడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం.. పేకాటలో పట్టుబడ్డ మహిళల దగ్గర నుండి 5 సెల్ ఫోన్లు, రూ.15,100ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్