- Advertisement -
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తెలంగాణ క్రీడా సంస్థలు
Telangana sports organizations meet international standards
ఒడిస్సా భువనేశ్వర్ లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలించిన తెలంగాణ అధికార బృందం
హైదరాబాద్ సెప్టెంబర్ 19
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ మరియు భవిష్యత్తులో ప్రతి లోకసభ నియోజకవర్గానికి ఏర్పాటు చేయనున్న క్రీడా పాఠశాలల ఏర్పాటు నిమిత్తం వివిధ అంశాలను పర్యవేక్షించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధికార బృందం ఒడిశా భువనేశ్వర్ లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించింది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వివిధ క్రీడ అంశాల్లో ఇస్తున్న క్రీడా శిక్షణతీరును ఈ బృందం పరిశీలించింది. ఈ ప్రాంగణంలోనిక్రీడా సదుపాయాల్ని, శిక్షణలో అమలుపరుస్తున్న నూతన పద్ధతుల్ని క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను,క్రీడాకారులకు కల్పిస్తున్న వివిధ వసతుల్ని ఈ బృందం పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంస్థలను మరియు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అకాడమీ లను తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ బృందం అధ్యయనం చేసింది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి, అధ్యక్షతన పర్యటించిన ఈ బృందంలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి రతన్ కుమార్ బోస్, రవి కుమార్ లు ఉన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించే అన్ని క్రీడా శిక్షణ సంస్థల పనితీరు మెరుగుపరచడానికి ప్రణాళిక రూపొందిస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డితెలిపారు
- Advertisement -