
చంద్రబాబుకు బెయిల్ పట్ల తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సవాలు
తెలుగుదేశం నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్*
నిజం గెలిచి చంద్రబాబు కు బెయిల్ వచ్చిందని సంకెళ్లతో చంద్రబాబును బంధించలేరని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. మంగళవారం చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం పట్ల హుజూర్నగర్ తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ కోదాడ ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఏ తప్పు చేయని చంద్రబాబునాయుడు గారిని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధించి వైసీపీ సైకోలు ఆనందించారని చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ యుద్ధం చేయలేని పిరికి పందలు వైసిపి నాయకులు అని విమర్శించారు.చంద్ర బాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు రావడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్, మీసాల సైదులు మఠంపల్లి ,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ ,కీసరి నాగయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వంశీ, హుజూర్నగర్ పట్టణ గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు గౌడ్, హుజూర్నగర్ పట్టణ కార్యదర్శి వల్లపు దాసు కోటయ్య గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల మహేష్, టిఎన్టియుసి నాయకులు కేసరి సైదులు తదితరులు పాల్గొన్నారు