- Advertisement -
డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం
Telugu communities welcome minister Kondapalli at Dallas airport
అమరావతి.
రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆదివారం న్న సాయత్రం డల్లాస్ కు చేరుకున్నారు. డల్లాస్ కు చేరుకున్న ఆయనకు స్థానిక ప్రవాసాంధ్రులు (తెలుగు సంఘాల ప్రతినిధులు) ఘన స్వాగతం పలికారు. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులను ఘనంగా సన్మానించారు. అయ్యన్నపాత్రుడుని లైఫ్ టైం అచీప్ మెంట్ పురస్కారంతో సత్కరించారు. ఈ వేదికపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని, గత నలభై ఏళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అయ్యన్నపాత్రుడు తనదైన పాత్రను పోషించారని చెప్పారు. యుక్త వయస్సులో రాజకీయాలలో రావటమే కాకుండా అతి పిన్నవయస్సులో మంత్రి పదవి పొందిన అయ్యన్నపాత్రుడు ఆ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్రవేశారని, కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆయన ఆయా రంగాలలో అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. అయ్యన్న పాత్రుడి సేవలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. వాషింగ్టన్ పర్యటన ముగించుకుని డల్లాస్ చేరుకున్న మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు తెలుగు సంఘాలు, ఎన్నారై టిడిపి నేతలు కోమటి జయరాం నేతృత్వంలో డల్లాస్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వాషింగ్టన్, డల్లాస్, అట్లాంటా పర్యటనలకు ఎన్నారై టిడిపి ముఖ్య నాయకులు శ్రీ కోమటి జయరాం మార్గదర్శనం చేస్తూ పర్యటనలు విజయవంతం అయ్యే విధంగా విశేషమైన కృషి చేస్తున్నారు.
- Advertisement -