ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించే తెలుగు సంవత్సరాది
యువతకు భక్తినేర్పరిచే విశ్వావసు
Telugu New Year to instill a sense of devotion among the people
విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి
రుపతి
ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు
రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.
తెలుగు సంవత్సరాది ఉగాది నేపథ్యంలో విశ్వావసు నామ సంవత్సర విశేషాలను ఆయన శనివారం తెలుగు ప్రజలకు తెలియజేసారు. విశ్వానికి ప్రతిరూపం శ్రీ విశ్వాస నామ సంవత్సరమని చెప్పిన చక్రధర్ సిద్ధాంతి…, ముందుగా తెలుగు ప్రజలందరికీ.., శ్రీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ విశ్వావసు అంటే అష్ట వసూలు ఈ భూమి మీదకు వచ్చిన దినమని పేర్కొన్నారు. ఉగస్య ఆది అనేదే ఉగాదని,.., “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయిందన్నారు చక్రధర సిద్ధాంతి. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం వస్తుందని.., ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే.. ద్వయ సంయుతం ‘యుగం’ కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయిందనీ…, అదే ఉగాది గాను, తెలుగు సంవత్సరాదిగా ప్రాచుర్యం పొందని వివరించారు.
పురాణాల ప్రకారం, ఛైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారనీ.. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ‘‘ఉగాది’’ఆచరణలోకి వచ్చిందని..,. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందనీ,. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారని వివరించారు.
యుగ ప్రారంభానికి నాంది పలికిన రోజు ఉగాది కనుకనే…ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం వల్ల సకల శుభాలను చేకూరుస్తుందని తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ఉగాది పచ్చడికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పిన చక్రధర్ సిద్ధాంతి.., షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడికి ప్రతిరూపమన్నారు. మానవ జీవితం కూడా షడ్రుచులతో మిళితమై ఉంటుందన్నారు.
తెలుగు వారి క్యాలెండర్ ఉగాది నుంచి ప్రారంభం అవుతుందనీ…, ఈ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటామన్నారు. దీనికి కారణం ప్రకృతి సహజత్వమనీ.., మనిషి ప్రకృతికి, కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడని చెప్పారు. కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు.. మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుందనీ తెలియజేశారు. హిందూ పంచాంగం ప్రకారం ఒకొక్క తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరమనీ చక్రధర సిద్ధాంతి వెల్లడించారు.
మార్చి 30 వ తేదీ ఆదివారం పాడ్యమి తిధి నుంచి ఈ విశ్వవాసు సంవత్సర మొదలు కానున్న నేపధ్యంలో ఈ ఏడాది మనిషి జీవితం ఎలా సాగనుంది..,ఆదాయ, వ్యయాలు, కష్ట, సుఖాలు, వ్యాధులు వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని భావిస్తామన్నారు. ఈ ఏడాదిలో మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందనీ.,. దీంతో రైతులకు ఫలాలను కూడా మోస్తరు రేటుతో ఇస్తాయన్నారు. సంపద అధికంగా ఉండదు. అదే సమయంలో అసలు ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదని తెలిపారాయన. ఈ సంవత్సరంలో వర్షాలు అధికంగా పడవు లేదా కరువు కూడా ఏర్పడదన్నారు. అంటే వర్షాలు సమృద్ధిగానే కురుస్తాయన్నారు . దొంగతనం భయం పెరుగుతుందనీ,. కొత్త వ్యాధులు లేదా ప్రతిచోటా ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారనే విషయాన్ని సిద్ధాంతి బహిరంగపరిచారు. రాజకీయాల్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు..
ముఖ్యంగా విశ్వావసు తెలుగు సంవత్సరం ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తుందనీ.., యువతకు భుక్తి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. విశ్వావసు సంవత్సరం ఆదివారం రావడం వల్ల.., సూర్యుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు.దీంతో ఎండలు కూడా మండే సందర్భం లేకపోలేదన్నారు.
ఉగాది పండగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుందనీ..,
ఈ నక్షత్రంలో ఏడాది ప్రారభం కావడం వలన ప్రజలు సౌమ్యంగా ఉంటారని చెప్పారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో చూడవచ్చునన్నారు. ఈ సంవత్సరంలో సంపద సమృద్ధిగా ఉంటుందనీ,… ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లగలరన్నారు.
ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుందనీ..,. ఇది శుభ యోగంగా పరిగణించబడుతుందని ప్రవచించారు. కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనదని కాంక్షించారాయన. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయనీ..,. పాలకులు, ప్రజలు ఇద్దరూ సంతోషంగా ఉంటారనీ ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి.., విశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిలో గోచరించే ఫలితాలను వెల్లడించారు.