Sunday, September 8, 2024

తెలుగుదేశం, చంద్రబాబు పేలిపోయే గాలి బుడగలు

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో నోటాతో పోటీ పడిన జనసేన

డిప్యూటీ సీఎం కొట్టు ఘాటు విమర్శలు

తాడేపల్లిగూడెం: తెలుగుదేశం పార్టీ దాని అధినేత చంద్రబాబు రెండూ కూడా పేలిపోయే గాలి బుడగలు లాంటివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నోటాతో పోటీ పడిందని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో శనివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరిచేలు, తడిసిన ధాన్యం రాశులను మంత్రి కొట్టు పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్నాధపురం గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని  ఎంత గాలి కొట్టినా తెలుగుదేశం మళ్లీ బ్రతికి బట్ట కట్టలేదని, చంద్రబాబు రాజకీయ జీవితం కూడా ముగిసిన అధ్యాయమని మంత్రి కొట్టు పేర్కొన్నారు. ఎంత గాలి కొట్టినా పేలిపోయే బుడగలే అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తెలుగుదేశం హయాంలో ఏనాడైనా రైతు నష్టపోతే సకాలంలో పరిహారం అందించాడా అని ప్రశ్నించారు. 2018లో హుదూద్ తుఫాను సంభవించి రైతులు నష్టపోతే ఎకరానికి 10000 పరిహారం ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు 2019 ఏప్రిల్, మే వచ్చిన దిగిపోయే వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్లో పరిహారం అందించి అన్నదాతను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు. వ్యవసాయం బాగుండి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ గట్టిగా నమ్ముతారన్నారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు దళారుల కోసం, రైస్ మిల్లర్ల కోసం పనిచేశాడు తప్ప రైతుల కోసం ఏనాడూ పనిచేయలేదు అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ప్రభుత్వమే రైతు నుంచి నేరుగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది అన్నారు. రైస్ మిల్లర్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తుందన్నారు.

ఈ విధంగా దళారీ వ్యవస్థ నిర్మూలించి, రైస్ మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించి సీఎం జగన్ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు తడిసిన, రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేలా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. రైతులు వర్షాల బారిన పడకుండా తమకు దగ్గరలో ఉన్న రైస్ మిల్లు కు ధాన్యాన్ని తోలుకునేలా ఆఫ్ లైన్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. దీనివలన రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు సురక్షితంగా చేర్చుకోగలిగారన్నారు. అలాగే రైస్ మిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారంటీతో నిమిత్తం లేకుండా ధాన్యం పంపేలా ఏర్పాట్లు జరిగాయన్నారు. ఆఫ్ లైన్ విధానం, తేమ శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలతో సీఎం జగన్ రైతులను ఉదారంగా ఆదుకున్నారన్నారు. అలాగే ధాన్యం అమ్మిన రెండు, మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో నేరుగా ధాన్యం డబ్బులు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడంతో ఎక్కడకు వెళ్లిన రైతులంతా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. పంటల భీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. దీనివలన రైతు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండానే ఒకవేళ పంట నష్టపోతే వేలు, లక్షల రూపాయల్లో పంటల బీమా కింద ఆర్థిక లబ్ధి పొందుతున్నారు అన్నారు. ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారంతో పాటు సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా 80% రాయితీతో విత్తనాలు కూడా ప్రభుత్వమే సరఫరా చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇలా రైతుల కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ సీఎం జగన్ రైతు పక్షపాతిగా గుర్తింపు పొందారని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

 నోటా తో జనసేన పోటీ   

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నోటాతో పోటీ పడిందని, దీనికి పవన్ సిగ్గుపడాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్