జగన్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ.
— మాజీ మంత్రి ఆర్కే రోజా
రాయచోటి,
Temples have witnessed a golden era precisely during Jagan’s tenure.
— Former Minister RK Roja
జగన్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలన్నింటికీ మహర్దశ కలిగిందని విరివిగా నిధులు మంజూరు చేసి నూతన ఆలయాలను నిర్మించడం జరిగిందని వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు .సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం తిమ్మక్క గారిపల్లెలో నూతనంగా నిర్మించిన కొండలరాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆర్ కె రోజా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు రాయలసీమ విద్యాసంస్థల అధినేత యర్రపురెడ్డి ఆనంద రెడ్డి హాజరై కార్యక్రమానికి హాజరు అయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన రోజాకు నిర్వాహకులు గొర్ల ఉపేంద్రా రెడ్డి, రమేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి కోట ఆంజనేయులు చౌదరి, ఆనంద్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. భక్తి, సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించిన రోజా.కుటుంబ సభ్యులు, గ్రామ మహిళలు, ప్రజలతో కలిసి మాజీ మంత్రి ఆర్ కె రోజా పూలు, పండ్లు సమర్పణగా తీసుకుని ఉపేంద్రా రెడ్డి నివాసంలో నుంచి సాంప్రదాయబద్దంగా మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అతి పురాతన కొండలరాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.విగ్రహ కదిలింపు, ధాన్యాదివాసం అనంతరం నూతన విగ్రహ ప్రతిష్ఠకు ముందు నిర్వహించే పిలుపు పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. శుద్ధోదకంతో అభిషేకం, అద్భుత అలంకరణ, గ్రామోత్సవ ప్రారంభ పూజల్లో పాల్గొని ఆమె తన అపార భక్తిని చాటుకున్నారు. అనంతరం స్వయంగా భక్తులకు కర్పూర హారతులు అందించి, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి, దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ,కాటమరాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.జగన్ ను అపర శ్రీకృష్ణదేవరాయలుగా ప్రజలు కీర్తించారని పేర్కొన్నారు. అలాగే రాయచోటి నియోజకవర్గం లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ల కృషితో ఆలయాల నిర్మాణాలు విస్తృత స్థాయిలో చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. కొండల రాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. భక్తులు, ప్రజలతో మమేకం..పూజా కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలతో మాజీ మంత్రి ఆర్ కె రోజా ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడి, ప్రేమానురాగాలు పంచుకున్నారు.భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొని, అందరి అభిమానం పొందారు.



