- Advertisement -
దిలావర్ పూర్ లో ఉద్రిక్తత..ఆర్డీవో నిర్భందం
Tension in Dilawarpur..RDO arrest
నిర్మల్
నిర్మల్ జిల్లా లో ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ను నిరసనగా మంగళవారం ఉదయం నుంచి దిలావర్ పూర్ -గుండం పల్లి గ్రామస్తులు జాతీయ రహదారి దిగ్బందించారు. అక్కడికి వెళ్లి ఆర్డీవో రత్న కల్యాణి ని చుట్టు ముట్టారు. వాహనం తో సహా నిర్భందించారు. ఈ క్రమంలో ఆర్డీవో ను వదలి పెట్టాలని ఎస్పీ జానకి షర్మిల పలు మార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరామిస్తామని స్పష్టం చేశారు. రాత్రి అయినా కూడా ఆందోళన కొనసాగడం తో ప్రత్యేక బలగాల ను తెప్పించారు. ఆర్డీవో ను సురక్షితంగా ఆందోళన కారుల నిర్భంధం నుంచి విడిపించి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ సందర్బంగా ప్రజలు అడ్డుకోవడం తో తోపులాట జరిగింది.ఆర్డీవో వాహనాన్ని ఆందోళన కారులు ధ్వంసం చేశారు.
- Advertisement -