- Advertisement -
బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత
Tension in Mylaram village of Balmur mandal
నాగర్ కర్నూలు
బల్మూర్ మండలం మైలారం గ్రామంలో గ్రామస్తులు, రైతులని పోలీసులు అరెస్టు చేసారు. దాంతో పోలీసులు గ్రామానికి రాకుండా ముళ్ళకంచ ఏర్పాటు చేసారు మహిళలు. స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు.
మా గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున ఐదు గంటలకే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వుంచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులను తక్షణం విడుదల చేయకపోతే పురుగుల మందు త్రాగి చాగడానికైనా సిద్ధమని తేల్చి చెపుతున్నారు.
- Advertisement -



