Friday, March 13, 2026

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించాల్సిందే :కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

- Advertisement -

కరీంనగర్ లో ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

ఉగ్రవాద నిర్మూలనే మోదీ ప్రభుత్వ లక్ష్యం

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించాల్సిందే

Terrorism in any form must be eradicated: Union Minister of State for Home Affairs Bandi Sanjay

పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది

ఉగ్రవాద నిర్మూలనకు యుద్దంలో పాల్గొనేందుకు ప్రజలు సిద్దమయ్యారు

ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో దేశ సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది
– కేంద్ర మంత్రి బండి సంజయ్

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించడం తోపాటు విద్యార్థులతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఝ చేయించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్దంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్దమయ్యారని తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్