Friday, January 10, 2025

తగ్గేదెలా…

- Advertisement -

తగ్గేదెలా…

Thaggedhele...

100 కోట్లపైనే  బెట్టింగ్స్
ఏలూరు, జనవరి 9, (వాయిస్ టుడే)
సంక్రాంతి పండుగకు మరో వారం ఉండగానే ఏపీలో పందెం కోళ్ల హంగామా నడుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండానే పందెం రాయుళ్లు కాలుదువ్వుతున్నారు. పెద్దగా హంగామా చేయకుండా రాత్రి వేళల్లో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నారు.చీకటి పడగానే 7 గంటలకు పందెం మొదలుపెట్టి లైట్ల వెలుతురులోనూ తెల్లారేలోపు కంప్లీట్ చేస్తున్నారు. ఉండి, భీమవరం ప్రాంతాల్లో ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో పందేలు వేస్తున్నారు. బరిలోకి దిగేవారికి సీక్రెట్ గా సమాచారం ఇచ్చి ఐడీ కార్డులను పంచుతున్నారు. అంతేకాదు ఇక వీరి పందేలను ఫొటో, వీడియో తీయకుండా ముందు జాగ్రత్తలు తీసకుంటున్నారు.ఇక ఒక్కో పందెం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున నడుస్తున్నాయట. కొన్నిసార్లు రూ.50 లక్షలకు వరకూ బెట్టింగులు పెడుతున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని తదితర మండలాల్లో కోళ్లను కొనుగోలు చేసి రంగంలోకి దిగుతున్నారట. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు గోదావరి జిల్లాకు తరలివెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజి డీఐజీ అశోక్‌కుమార్‌ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు గుట్టు చప్పుడు కాకుండా కాసులు దండుకోవడం సంచలనం రేపుతోంది.
ఎక్కెడక్కడ జరుగుతాయంటే
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు కోడిపందాలు జోరున సాగుతుంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో కోడిపందాలు చాలా ప్రసిద్ధి చెందినవి. కోడిపందాలు అనేవి ఇక్కడ సాంప్రదాయంలో ఒక భాగం. ఏపీలో సంక్రాంతి కోడిపందాలు ఏ ఏ ఊళ్ళల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించే పట్టణాల్లో భీమవరం ఒకటి భీమవరం చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తారు. ఇక్కడ కోడిపందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు వస్తారు. ఇక్కడ కోడిపందాల సమయంలో వందల కోట్లు చేతులు మారుతుందని స్థానికులు చెబుతుంటారు.తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తారు. ఇక్కడ కోడిపందాలు చూసేందుకు పెద్ద ఎత్తున ఔత్సాహికులు తరలి వస్తుంటారుపశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తారు. ఇక్కడ కోడిపందాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు.గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కూడా కోడిపందాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. నిజానికి వీటి పైన ప్రభుత్వం నిషేధం పెట్టినప్పటికీ కూడా అనధికారికంగా ఈ పొందాలను ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే అనధికారికంగా నిర్వహించే కోడిపందాల బరుల్లోకి వెళ్ళినట్లయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కనుక చట్టాన్ని అతిక్రమించకుండా ఉంటే మంచిది.మరోవైపు ఈ కోడి పందాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతుంది. కోడి పందాల పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. అయితే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోడిపందాలపై నిషేధం విధించిన కారణంగా, కోడిపందాలలో పాల్గొన్న వారి పైన పోలీసులు కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.మరోవైపు కోడిపందాలతో పాటు సాంప్రదాయ క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం ప్రతి గ్రామంలోనూ చూస్తాము. ముఖ్యంగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున పాల్గొంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్