కలెక్షన్ల హవాలో తాయ్ కళవి
Thai art in the air of collections
తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ‘తాయ్ కిళవి’ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. శివకార్తికేయన్ – సుధాన్ సుందరం నిర్మించిన ఈ సినిమాకి, శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. రాధిక శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ మూవీ, ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పోస్టర్స్ దగ్గర నుంచే బజ్ పెంచుకుంటూ వెళ్లిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. తొలి వారంలో 25 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండో వారంతో కలుపుకుని 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. రాధిక మాస్ లుక్ .. ఆమె డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రను ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ చేశాయని అంటున్నారు. కథాకథనాలు.. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. రాధిక ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. అయితే 60 ఏళ్లకి పైగా వయసున్న ఆమె, ఇప్పుడు చేసిన ఈ సినిమా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ఒక రికార్డుగా చెబుతున్నారు.



