ఫలించిన 29వ డివిజన్ కార్పొరేటర్ సాగర్ కృషి
ఎంపీ రవిచంద్ర చొరవతో రెండు బోర్లు మంజూరు
3 లక్షల వ్యయంతో వేసిన రెండు బోర్లు
Thanks to MP Ravichandra’s initiative, the efforts of 29th Division Corporator Sagar have borne fruit.

కొత్తగూడెం
వేసవికాలంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్లోని ప్రజలకు మంచినీటి ఎద్దడి రాకుండా చూసేందుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చొరవు తో రెండు బోర్లు మంజూరు చేసినట్లు ఆ డివిజన్ కార్పొరేటర్ సాగర్ వెల్లడించారు. డివిజన్ లోని ప్రగతి నగర్ ఏరియా లోగల మానస వికాస్ పాఠశాల ముందు లైన్ లో ఒకటి, గొల్లగూడెం ప్రాంతంలో మరొకటి బోర్లు వేయడం జరిగింది. గొల్లగూడెం ప్రాంతంలోని ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దీరాజు రవిచంద్ర చొరవతో సుమారు రు. 3 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. కాగా 29వ డివిజన్ కార్పొరేటర్ “మల్హోత్రా సాగర్ డివిజన్ పరిధిలో 200 అడుగుల రెండవ బోర్ వేయించడం జరిగినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా గౌ”కార్పొరేటర్ మల్హోత్రా సాగర్ మాట్లాడుతూ, తాను ఇచ్చిన మాట, హామీలను అమలు చేయడం లో బిఆర్ఎస్ ఎంపీ వద్దీరాజు రవిచంద్ర సహాయం, తోడ్పాటు చాలా గొప్పది అని కొనియాడారు. అధిక సంఖ్యలో పాల్గొన్న డివిజన్ ప్రగతి నగర్ మహిళలు గత 5 సంవత్సరాలుగా నీటి కొరత ,ఇబ్బందులను తీర్చడం తో మల్హోత్ సాగర్ పాత్ర అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కరాటే శ్రీనివాస్ యాదవ్ , పార్టీ కార్యకర్తలు కన్నా ,శ్రీకాంత్, మల్హోత్రా కుమార్,సాగంటి రవి, కల్లుగడ్డ సురేష్,వేముల పవన్, చింతల రాము, బండి శివ,బండి అశోక్, రియాజ్ (అబ్బూ) మహమ్మద్ షాను,ముతంగి యాదగిరి,సందరబోయిన శ్రీను,జి.శరత్,జి.నాగరాజు, బంటి, లేతాకుల నాగరాజు, లగిశెట్టి ప్రసాద్, గుడిసె శ్రావణ్, షేక్ అల్తాఫ్ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.



