మంథని నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీనిచ్చిన శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను సన్మానించిన రామగిరి లావణ్య.
కమాన్ పూర్
పెద్దపల్లి ఎంపీగా గెలుపులో ప్రధాన పాత్ర వహించిన మంథని ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కి పెద్దపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ఎంపీగా భారీ ఆధిక్యతలో ఉన్న గడ్డం వంశీకృష్ణను రామగిరి లావణ్య నాగరాజు మంగళవారం ఘనంగా సన్మానించారు. గడ్డం వంశీకృష్ణ గెలుపు లో శ్రీధర్ బాబు కీలకపాత్ర వహించారని అలాగే వంశీకృష్ణకు భారీ మెజార్టీ రావడంలో ఎంతో కృషి చేశారని లావణ్య పేర్కొన్నారు. మంథని నియోజక వర్గం కాంగ్రెస్ కంచుకోట అని అలాగే భారీ మెజార్టీ ఇచ్చిన మంథని నియోజకవర్గ ప్రజలకు రామగిరి లావణ్య నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. అలాగే వంశీకృష్ణ గెలుపులో పాత్ర వహించిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ధరంపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ లకు రామగిరి లావణ్య నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఎంపీగా గెల్పొందుతున్న గడ్డం వంశీకృష్ణకు రామగిరి లావణ్య నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు.