Tuesday, February 17, 2026

శిల్పకళా వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ 14వ వార్షికోత్సవ సంబురాలు.

- Advertisement -
కొండాపూర్ 
వాయిస్ టుడే:

The 14th anniversary celebrations of the Sankshatri Group of Schools was held in grand style as a sculpture platform.
The 14th anniversary celebrations of the Sankshatri Group of Schools was held in grand style as a sculpture platform.

శిల్పకళా వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ 14వ వార్షికోత్సవ సంబురాలు.
The 14th anniversary celebrations of the Sankshatri Group of Schools was held in grand style as a sculpture platform.
విచ్చేసిన అతిరథమహారథులు, ప్రముఖులు, నాయకులు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు. అలరించిన సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ విద్యార్థిని, విద్యార్థుల సాంస్కృతిక నృత్య, కళా ప్రదర్శనలు. అతి తక్కువ ఫీజులతో, అన్ని తరగతుల కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తూ, దినదినాభివృద్ధి చెందుతూ, అందరి మన్ననలు పొందుతూ, చుట్టూ ప్రక్కల మంచి స్కూల్స్ గా పేరు గాంచిన సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ నేడు 14వ వార్షికోత్సవ సంబురాలు జరుపుకుంది. సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ 14వ వార్షికోత్సవ వేడుకలకు మాదాపూర్ లోని శిల్పకళా ఆడిటోరియం వేదికగా మారింది. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ , పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ , సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డి చైర్ పర్సన్, ప్రొఫెసర్ అలేఖ్య పంజాల , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసారు. ఈ సందర్బంగా సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ గారు విచ్చేసిన ప్రముఖులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి, శాలువాతో సన్మాంచి, మెమోంటోతో సత్కరించారు. అనంతరం సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ యొక్క విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక, నృత్య, కళా ప్రదర్శనలు విచ్చేసిన అహుతులను, ప్రముఖులను, నాయకులను, తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా విచ్చేసిన ప్రముఖులు సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ యొక్క విద్యార్థిని, విద్యార్థులు ఈ 14 సంవత్సరాలలో సాధించిన విజయ ప్రస్థానాలను కొనియాడారు. విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి గురి చెయ్యకుండా, వారికీ అర్ధం అయ్యేట్టుగా విద్య భోధన చెయ్యటంలో సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ నూతన ఒరవడిని సృష్టించిందని అన్నారు. నేటి రోజులలో అతి తక్కువ ఫీజులతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిచటం అంటే కత్తి మీద సామేనని అన్నారు. కానీ సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ విద్యా విధానంలోను, స్కూల్ ఫీజుల విషయంలోను, చరిత్ర సృష్టించిరాని అన్నారు. ముఖ్యంగా అన్ని తరగతి కుటుంబాలకు అందుబాటులో విద్యను అందించాలని, ఎవరికి సాధ్యం కానీ అతి తక్కువ ఫీజులతో, ఉన్నత విద్యను అభ్యసించిన సిబ్బందితో ఈ సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ నడపటం చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుందని అన్నారు. సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని విచ్చేసిన పెద్దలు ఆకాంక్షించారు. సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ 14వ వార్షికోత్సవ వేడుకల్లో సీనియర్ నాయకులు పేరుక రమేష్ పటేల్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు తిరుపతి, బుడుగు తిరుపతి రెడ్డి, చింతల రాజు యాదవ్, పలువురు ప్రముఖులు, దాదాపుగా 15 వందల మంది విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్