Friday, January 17, 2025

16 రోజుల నిరవధిక సమ్మె ఒప్పందాలు అటకెక్కినట్టేనా

- Advertisement -

16 రోజుల నిరవధిక సమ్మె ఒప్పందాలు అటకెక్కినట్టేనా

The 16-day indefinite strike agreements have stalled

బద్వేల్ లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఒప్పందాల జీవోల జారీకై ధర్నా

బద్వేలు

వైసిపి ప్రభుత్వ హయాంలో సమాన పనికి -సమాన వేతనం,కాంట్రాక్ట్‌- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ ఇతర హామీల అమలు కోసం మున్సిపల్‌ కార్మికులు దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహించి,నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ కేసులు ఎదుర్కొని మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహించి, 2023 డిసెంబర్‌ 26 నుండి 2024 జనవరి 11వ తేదీ వరకు 17 రోజులు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందాల
జి ఓ ల సాధనకై నేడు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రబాబు మాట్లాడుతూ…
‘క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌’ వర్కర్లకు (33,500 మందికి) రూ.15 వేల నుండి రూ.21 వేలకు, యుజిడి, చెత్త వాహనాల డ్రైవర్లకు రూ.18,500/- నుండి రూ.24,500/-కు జీతాలు పెంచుతూ జీవో ఎం.ఎస్‌. నెంబర్‌ 36 జారీ చేసిందని,12-13 వేల మందిగా ఉన్న ఇంజనీరింగ్‌ కార్మికులకు జీతాల పెంపు కోసం 9 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని,ఆనాటి సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా నమోదు చేసిన పోలీసు కేసులన్నింటిని ఉపసంహరిస్తూ 2024 మార్చి 15వ తేదీ 357 జీవోను జారీ చెయ్యడమంటే రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో గర్వించదగిన పోరాటమని గుర్తు చేశారు.
మున్సిపల్‌ రంగంలోని 48 వేల మందిగా ఉన్న ఇంజనీరింగ్‌, పారిశుధ్య కార్మికులందరికీ వర్తింపచేసే విధంగా నాటి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఊసులో లేకుండా పోయాయని, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు (10 సంవత్సరాల సర్వీసు ఉంటే రూ.75 వేలు ఆ పైన ఏడాదికి రూ.2 వేలు అదనంగా చెల్లిస్తామని, ప్రమాద బీమా రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంపు, దహన సంస్కారాలకు రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంపు, ఇంజనీరింగ్‌ కార్మికుల జీతాల పెంపు, సంక్షేమ పథకాలు, పర్మినెంట్‌ కార్మికులకు సరండర్‌ లీవ్‌లు, జి.పి.ఎఫ్‌ అకౌంట్లు తదితర డిమాండ్ల పరిష్కారానికి 2024 జనవరి 24వ తేదీన నాటి ప్రభుత్వం ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సిఫార్సు చేసింది. కాగా ఆ తరువాత సాధారణ ఎన్నికలు రావడంతో ఈ ఫైళ్ల వ్యవహారం మూలన పడింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మున్సిపల్‌ కార్మికుల ఫైళ్లన్నింటిని తిరిగి వెనక్కి తేప్పించుకొని  5 నెలలు గడిచినా పట్టించుకునే నాథుడు లేడని,తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై మున్సిపల్‌ కార్మికులు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారుతున్నాయని,
రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు కొన్ని శాఖలలో రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్ళకు పెంచిన, మున్సిపల్‌ కార్మికులకు మాత్రం పెంచకుండా 60 ఏళ్ళు నిండాయనే సాకుతో బలవంతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు,చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు. గత ఏడాది కాలంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించడంలేదని అన్నారు. . ఇవి కాకుండా పి.ఎఫ్‌ క్లెయిమ్‌లు రకరకాల సాకులతో దీర్ఘకాలికంగా పెండింగ్‌ పెడుతున్నాయి. కార్మికులకు పని చేసేందుకు అవసరమైన పనిముట్లు సైతం సక్రమంగా అందించడంలేదు. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంటున్నది.వీధి లైట్లు, వాటర్‌ సెక్షన్‌, టౌన్‌ ప్లానింగ్‌, గార్డెనింగ్‌, వెటర్నరీ, మెకానిక్‌లు తదితర విభాగాలలో పని చేస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు పనికి తగిన విధంగా జీతాలు చెల్లించడంలేదు. 2012లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎం.ఎస్‌. నెంబర్‌ 11 లోని క్యాటగిరీల ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు జీతాలు చెల్లించడంలేదు. 2018 వరకు పారిశుధ్య కార్మికులతో సమానంగా ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా జీతాలు చెల్లించారు. ప్రస్తుతం అత్యధిక మంది ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.15 వేలు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ రిస్క్‌ అలవెన్స్‌ చెల్లించడంలేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్