గ్రీష్మ పైన దాడి చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి
The accused who attacked Greeshma should be punished severely
ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్న గ్రీష్మను
పరామర్శించిన మహిళా సంఘాల నేతలు
పిడుగురాళ్ల,
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ గ్రామ సమీపంలోని అడవుల్లో తమ్మిశెట్టి గ్రీష్మ పైన దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనజాగృతి మండలి వ్యవస్థాపాక అధ్యక్షురాలు పిడతల రమాదేవి, హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనూరి కృష్ణ కుమారీ లు డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ అడవుల్లోకి సోమవారం మల్లిఖార్జున అనే యువకుడు గ్రీష్మ ను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయ పర్చాడు. ప్రస్తుతం గ్రీష్మ నరసరావుపేట ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గ్రీష్మను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహిళ నేతలు
రమాదేవి, కంచరగుంట్ల సుజాత, పూనూరి కృష్ణ కుమారి లు మాట్లాడుతూ, గ్రీష్మకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి న్యాయం చెయ్యాలని కోరారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన నిందితుణ్ణి పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రీష్మ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు కంచరగుంట్ల సుజాత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మరియు రాష్ట్ర హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ ఎగిజీక్యూటివ్ డైరెక్టర్ మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పూనూరి కృష్ణ కుమారి, హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ పల్నాడు ప్రెసిడెంట్ షేక్ నుర్జాహాన్, ముస్లిం చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షకీలా, కే. రజని కుమారి తదితరులు పాల్గొన్నారు.