Thursday, March 26, 2026

రైతులకు రాబడి పెంచడమే లక్ష్యం

- Advertisement -

రైతులకు రాబడి పెంచడమే లక్ష్యం

The aim is to increase the income of the farmers

ఆళ్లగడ్డ
రైతన్నలు సూక్ష్మ పోషకాలలోపాలను గుర్తించాలి
వినూత్న అగ్రోటిక్ ఎల్ ఎల్ పి
రైతులకు రాబడి పెంచడమే లక్ష్యంగా వినూత్న ఆగ్రో టెక్ ఎల్ ఎల్ పి సంస్థ లక్ష్యమని, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న రైతన్నలకు అధిక దిగుబడులు అందించేందుకే రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని వినూత్నఆగ్రోటెక్ ఎల్  ఎల్  పి మార్కెటింగ్ డెవలప్మెంట్ ప్రతినిధి బిల్లా రాజేష్ యాదవ్, ఏ ఎన్ పి ప్రవీణ్, ఏ ఎస్ ఎం  చెన్నకేశవ ,ఎస్ ఓ ఉదయ్ కుమార్ రెడ్డి , ఎఫ్ ఏ కిరణ్  లు అన్నారు. గురువారం అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కుడూరు గ్రామంలో రైతన్నలకు వినూత్న ఆగ్రోటిక్ ఎల్ ఎల్ పి సంస్థ ఆధ్వర్యంలో  రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  వ్యవసాయ క్షేత్రంలో వచ్చే తెగుళ్లు వాటి నివారణ చర్యలపై, సేంద్రియ ఎరువుల వాడటం వల్ల వచ్చే అధిక లాభాలపై రైతన్నలకు అవగాహన కల్పించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటలో సూక్ష పోషకాల లోపాలను గుర్తించాలన్నారు. అధిక కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని, భూమిలో సూక్ష్మ జీవుల వృద్ధిరేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సేంద్రియ ఎరువులతోనే తక్కువ పెట్టుబడితో పంటల సాగు ను చేపట్టి అధిక దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. అనంతరం రైతులతో కలిసి సేంద్రియ ఎరువుల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులకు పంటల సాగులో చేపట్టాల్సిన
సస్యరక్షణ పద్ధతులు ప్రస్తుత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు “వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” వారి రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్,  రైతుమిత్ర, ప్రణయ్,  గ్రో హై గ్రాన్యూల్స్,  గ్రో హై లిక్విడ్,  డెల్టా ప్రో,  తులిప్,  యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో  కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ ,  రత్నా,  పృధ్వీరాజ్, తిరంగా,  నైట్స్,  త్రిలోక్,  ఇగ్నిస్ 5  అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ 75 న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్  (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్