సమ సమాజ స్థాపనే సిపిఐ ధ్యేయం
The aim of CPI is to establish an equal society
సిపిఐ జిల్లా నేత,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు
కోరుట్ల,
శ్రమజీవుల హక్కుల రక్షణ అభ్యున్నత కోసం శక్తి వంచన లేకుండా సమసమాజ స్థాపనే ధ్యేయంగా
అనునిత్యం పేదల పక్షాన పోరాడింది కమ్యూనిస్టు పార్టీయేనని సిపిఐ జిల్లా నేత, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు అన్నారు..
గురువారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయం సి. ప్రభాకర్ భవన్లో సిపిఐ జెండాను ఎగరవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు..
ఈ సందర్భంగా పలువురు సిపిఐ నేతలు మాట్లాడుతూ భారతదేశంలో 26 డిసెంబర్ 1925 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్న శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు..
జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిందని అన్నారు.హైదరాబాద్ నిజాం రాజు రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి పేదల పక్షాన భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నిన వాడికి భూమి కావాలని జరిగిన ఉద్యమ పోరాటాలలో 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని 5 వేల గ్రామాలు రాజరికం పాలన నుండి విముక్తి పొందాయని 10 లక్షల ఎకరాలు భూమి పేదలకు పంచిందన్నారు ఈ పోరాటగటం చరిత్రలో నిలిచిందన్నారు..
1952లో మొదటిస్వాతంత్ర ఎన్నికలలో 61 మంది లోక్సభ స్థానంలోపోటీపడి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ 23 స్థానాలలో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిందన్నారు పార్లమెంట్ బ్యాంక్ జాతీయ మైనవని భూసంస్కరణల కార్మికుల అనుకూలమైన చట్టాలు రూపకల్పన తదుపరి కాలంలో ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం గృహహింస చట్టం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఇంకా అనేక సాధించ బడిందన్నారు… నాటినుండి నేటి వరకు పేదల బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉందన్నారు.. ప్రభుత్వాలు పాలకులు మారిన పేద కార్మిక రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.. ఇలాంటి వాటిపై బలమైన ఉద్యమ పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు..ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎండి మౌలానా, సిపిఐ జిల్లా నేతలు ఎండి ముక్రం, ఉస్మాన్, ఎన్నం రాదా, రామిల్ల రాంబాబు, సాంబార్, మహేష్ ,కొక్కుల గంగాధర్, తిప్పర్తి రమేష్, అందే వంశీకృష్ణ ,సమీర్, గుండేటి పోశెట్టి, దాసరి మనోహర్, ఎస్ కే చాంద్, పాషా తదితరులు పాల్గొన్నారు..