క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
The aim of the government is to promote sports
క్రీడాకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి
క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడాకారుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో కీ.శే అనిరెడ్డి సత్యనారాయణ జ్ఞాపకార్థం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీకి సంబంధించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులకు ట్రోఫితో పాటు నగదు బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…. టోర్నీలో విజయం సాధించిన జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత కష్టపడాలనీ, ఇంత పెద్ద ఎత్తున టోర్నీని నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని, కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఉండే ఆర్గనైజేషన్ ఉంది అంటే అది కేవలం క్రీడలు, క్రీడ మైదానమే అని, క్రీడాకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర రాములు గౌడ్, చాట్ల భాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కడారి తిరుపతి, ఇనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి, పవన్ రెడ్డి, ప్రశాంత్, కార్యకర్తలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.