యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఖరారు
లక్నో ఫిబ్రవరి 21
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై గత రెండు, మూడు రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నాయి.అధిక స్ధానాలకు కాంగ్రెస్ పట్టుబట్టడంతో సీట్ల సర్దుబాటులో జాప్యం నెలకొంది. ఇక ఇరు పార్టీల పొత్తుపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించడంతో ప్రతిష్టంభనకు తెరపడింది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఖరారు కావడంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -