28న ఎల్బీనగర్ లో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
ఎల్బీనగర్, వాయిస్ టుడే: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుల హక్కులను నెరవేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రతినిధులు, ఉద్యమకారులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్.కే.గార్డెన్‌లో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయమై ఉద్యమకారులు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రతినిధులు, ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారమే ఏకైక ధ్యేయంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. శనివారం జరిగే ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి అధ్యక్షులు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి పిండిగ వెంకన్న, ఉద్యమకారులు కాచం సత్యనారాయణ గుప్త, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, జీవీ.సాగర్ రెడ్డి, బీరెల్లి వెంకట్ రెడ్డి, గోర శ్యాంసుందర్ గౌడ్, సతీష్ యాదవ్, శ్రవణ్, శర్మ, సైదులు, సుర్వి రాజు గౌడ్, రాంకోటి, సల్వాచారి, ఉద్యమకారులు పాల్గొన్నారు.