కాల్వలు,కుంటలను పరిశీలించిన అధికార బృందం
The authority team inspected the canals and ditches
మేడ్చల్
నగరశివార్లయిన దుండిగల్, బాచుపల్లి మున్సిపల్ పరిధి లోని ప్రాంతాల్లో జీహెచ్ఎంసి, ఇరిగేషన్ , హైడ్రా సిబ్బంది సుడిగాలి పర్యటన చేసారు. మునిసిపల్ పరిధిలోని కత్వా చెరువు, పోతిన్ కుంట, నేరెళ్ళ నాల లు మరియు మల్లంపేట లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాస్ ను ఈ బృందం పరిశీలించింది. నాలాలు , చెరువులు కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించడంతో వర్షం నీరు కత్వా చెరువులోకి రావడం లేదు, దీంతో కత్వా చెరువు నుంచి క్షేత్రస్థాయి లో హైడ్రా బృందం, ఇరిగేషన్ మరియు మునిసిపల్ అధికారులు పరిశీలించారు. నాలాలు, కాల్వలు ఆక్రమించుకోవడంతో దుండిగల్ మండల మరియు జిన్నారం మండల చెరువులు పూర్తిగా నీరు లేక కబ్జాకు గురవుతున్నట్లు గ్రహించారు.. పరిశీలించిన బృందం నివేదికను తయారు చేసి హైడ్రా కమిషనర్ కు సమర్పిస్తున్నట్లు బృందం తెలిపింది.