‘వదలా’ మూవీ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్

- Advertisement -

 ‘వదలా’ మూవీ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్

The beautiful family melody ‘Aa Ningi Ee Nela’ from the movie ‘Vadala’.

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ , టైటిల్ ట్రాక్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం ‘ఆ నింగీ ఈ నేల’ అనే అందమైన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలోడీని విడుదల చేసింది.
మనసును హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ పాట కుటుంబ అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది.కృష్ణవేణి మల్లవజ్జల అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోయగా, కార్తీక్ కోడకండ్ల తన మధుర గానంతో మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు కార్తీక్ బి. కోడకండ్ల స్వరపరిచిన ఈ మెలోడీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
జగపతి బాబు, లయల మధ్య కనిపించే సహజమైన ఫ్యామిలీ కెమిస్ట్రీ ‘ఆ నింగీ ఈ నేల’ పాటకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.
ఈ చిత్రానికి చోటా కె నాయుడు డీవోపీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, లక్ష్మీ భూపాల రైటర్.
తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular