- Advertisement -
అత్యుత్తమం మన సైన్యం
The best is our army
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
సికింద్రాబాద్
తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) ప్రాంగణంలో 106వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాలేజ్ కమాండెంట్, లెఫ్ట్నెంట్జ జనరల్, నీరజ్ వార్షిని, విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఉత్తీర్ణులైన 49 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ కోర్స్కు – 105 ,మరియు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు -42, విద్యార్థులకు, గవర్నర్ సర్టిఫికెట్ పత్రాలను అందజేశారు, మిత్ర దేశం బూటాన్ నుండి శిక్షణ పొందిన వారున్నారు. అత్యుత్తమ ప్రదర్శన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రాడ్యుయేట్లకు రజత, బంగారు పతకాలను బహుకరించారు.
క్యాడెట్ల విద్యావిషయక విజయాలను పురస్కరించుకుని, వాటిని ప్రదర్శించారు. రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన అధికారులను తయారు చేసేందుకు సంస్థ యొక్క నిబద్ధత. జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఇంజినీరింగ్ విద్య యొక్క సమగ్ర పాత్రను నొక్కి చెబుతూ, సైన్యంలో సాంకేతిక నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను ఈ వేడుక హైలైట్ చేసింది.
గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఇది దేశం గర్వించదగ్గ శిక్షణ కార్యాలయం అని కొనియాడారు ఈ సైనికస్నాతకోత్సవము. సాయుధ దళాల ప్రత్యేక శిక్షణ అని శ్రేష్ఠతతో కూడిన నాణ్యత, నైపుణ్యత, శిక్షణ ఉందన్నారు. దేశ రక్షణ భద్రతలో ప్రధాన పాత్ర వీరిది. ప్రపంచంలోనే ప్ర ప్రపంచంలోనే మన సైన్యం అత్యుత్తమంగా నిలుస్తుంది అన్నారు
- Advertisement -