బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలి.
మాజీ పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరి భూషణ్
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 22:జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా రాష్ట్ర ప్రజలు ఓడించాలని అప్పుడే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరి భూషణ్ అన్నారు . ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా ఇవ్వాలా రాష్ట్రాన్ని బందిపోట్ల చేతుల్లో నుంచి కాపాడమనేది రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రధానమైన బాధ్యత. నైజాం, నవాబుల కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్నా ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్నిటిని ఈ పదేళ్ల కాలంలో మరి ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో ఈ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం అమ్మకాలు పెట్టేసి రాష్ట్ర సంపదనను ప్రజలకు సంబంధించిన ఆస్తులు అన్నిటిని కూడా వాళ్ళ సొంత ఖజనాలు నింపుకోవడం కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి వాళ్ల ఆగడాలను అడ్డుకోకపోతే రాష్ట్ర ప్రజలందరిని తిప్పలపెట్టే పరిస్థితిని చాలా తొందరలోనే మనకు చూపిస్తారని ఆయన అన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, వీలైనంత తక్కువ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా కోరుతూ ప్రజలను వాళ్లని ప్రోత్సహించేలా చేయడం కోసం వాళ్లను చివరి వరకి యుద్ధంలో నిలబెట్టి బిఆర్ఎస్ పతనాన్ని చూడడం కోసమే ప్రధానంగా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త వరకు కూడా తిరుగుతూ వాళ్ళను ప్రోత్సహిస్తూ వస్తుండు.అలాగే బిఆర్ఎస్ రాష్ట్రంలో, బిజెపి దేశంలో రెండు కలిసి దేశంలో వాళ్లు దేశాన్ని అంతా కూడా దేశ సంపదనతో కూడా రాష్ట్రంలో వీళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి రాష్ట్రాన్ని రాష్ట్రం తో పాటు దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రజలందరి మీద ఉందన్నారు.కాబట్టి బిఆర్ఎస్ ను,బిజెపిని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఓటర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ కు అనుకులంగా రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. ప్రజలలోకి ఈసారి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా వారిని బొంద పెట్టాలని చెప్పేసి ప్రజలు ఇప్పటికే తీర్మానించుకొని ఉన్నారన్నారు . ఈ చివరి సమయంలో ఈ వారం రోజులలో వాళ్ళు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి లేకపోతే మన పార్టీ కార్యకర్తల దగ్గరికి నాయకులు దగ్గరకు వచ్చి ప్రలోభాలు పెట్టడం భయపెట్టడం ఇట్లాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికి కార్యకర్తలు, నాయకులను భయపెట్టే కార్యక్రమాలు చాలా చోట్ల చేస్తానే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళని కూడా బెదిరించి మళ్ళీ వాళ్ల మీద బలవంతంగా బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి వాళ్లను భయపెట్టిచ్చి మల్లి లొంగదీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కండువాలు మార్చినంత మాత్రాన వారి మనసులో నుండి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరికను ఎవరు కూడా ఆపలేరని ఈ సందర్భంగా హరి భూషణ్ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండలింగంపల్లి యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ సాయి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, రామచంద్రం, మందాటి దేవేందర్ యాదవ్, హరి భూషణ్ అనుచరులు ఉన్నారు.