కోర్టులపైనే గులాబీ ఆశలు
హైదరాబాద్, మార్చి 12, (వాయిస్ టుడే )
The ‘BRS Party’ Pins Its Hopes on the Courts
ఎట్టకేలకు..ఊహించని ట్విస్ట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పది మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో మొదటి నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులు మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అనే టాక్ ఉండేది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడమే కాదు..కాంగ్రెస్ బీఫామ్ మీద లోక్‌సభ ఎంపీగా కంటెస్ట్ చేశారు.ఇక తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై కడియం శ్రీహరి సంతకం చేసినట్లు అలిగేషన్స్ ఉన్నాయి. పైగా తన కూతురు గెలుపు కోసం కడియం ప్రచారం చేసినట్లు కూడా బీఆర్ఎస్ వీడియో ప్రూఫ్‌లు సబ్మిట్ చేసింది. ఈ కీలక ఆధారాలు ఉన్నాయని భావించి..ఈ ఇద్దరిపై స్పీకర్ వేటు వేస్తారని బలమైన ఒపీనియన్ కొనసాగింది. కడియంను సేవ్ చేసినా దానం నాగేందర్‌పై మాత్రం వేటు వేయడమో? రాజీనామానో? పక్కా అన్న టాక్ నడిచింది. ఇదేది జరగలేదు. ఎవరూ ఊహించనట్లు..కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నట్లుగా స్పీకర్ తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతున్నారుపలుసార్లు కోర్టు స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం..సభాపతి కూడా విచారణకు సమయం కోరడంతో..వేటు వేస్తారని బీఆర్ఎస్ కూడా బలంగా నమ్మింది. ఒకానొక టైమ్‌లో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ బై ఎలక్షన్స్‌కు కారు పార్టీ రెడీ అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపు ఎపిసోడ్‌లో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. నెక్స్ట్ బీఆర్ఎస్ స్టెప్ ఏంటన్నదే కీలకంగా మారింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కనుందా? లేక కడియం, దానం విషయంలో మాత్రమే సీరియస్‌గా ఉందా? అసలు బీఆర్ఎస్ ఆలోచన ఏంటన్నది ఆసక్తికరంగా మారిందిఅయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో తాము వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే..స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో..గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాలను తెరలేపుతోందన్న చర్చ జరుగుతోంది. మరోసారి అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కేందుకు ప్రిపేర్ అవుతోందట. కచ్చితంగా దానం, కడియం శ్రీహరిపై వేటు పడుతుందని..దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గతంలో కోర్టులు అనర్హత వేటు వేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. న్యాయ స్థానాల ద్వారా..స్పీకర్ నిర్ణయం తప్పని ప్రూవ్ చేస్తామన్న ధీమాలో ఉన్నారు. జ్యుడీషియల్ రివ్యూ ద్వారా జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా పోరాడి తీరుతామంటున్నారు గులాబీ నేతలు.అయితే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సుప్రీంకోర్టు ప్రెజర్ పెట్టగలిగింది. ఎట్టకేలకు సభాపతి ఓ డెసిషన్ తీసుకున్నారు. కానీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పే అధికారం కోర్టులకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్‌లో..స్పీకర్, ఛైర్మన్ నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబడుతుందా? బీఆర్ఎస్ సబ్‌మిట్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా..వేటు వేస్తుందా? అనేది డిస్కషన్ పాయింట్‌గా మారింది.బీఆర్ఎస్ లీడర్లు మాత్రం పలు కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను గుర్తు చేస్తున్నారు. కాస్త సమయం పట్టినా జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ డెసిషన్‌ను తప్పుబడుతూ సుప్రీంకోర్టు వేటు వేస్తే మాత్రం దేశంలోనే సెన్సేషనల్ తీర్పు అయ్యే అవకాశం ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో దేశం మొత్తానికి తెలంగాణ ఎపిసోడ్ ఓ బెంచ్ మార్క్‌గా నిలవనుంది. కానీ సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ కాబోతుందనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరి అత్యున్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్‌కు ఆశించిన తీర్పు వస్తుందా? రాదా? అనేది చూడాలి.



