Wednesday, June 18, 2025

భారంగా మారుతున్న కొండా..

- Advertisement -

భారంగా మారుతున్న కొండా..
వరంగల్, మే 17, (వాయిస్ టుడే )

The burden is becoming heavy..

మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొండాసురేఖ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని మార్లు చెప్పినప్పటికీ ఆమె తీరు మారడం లేదు. కేటీఆర్ మీద కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆమె పరువు నష్టం దావాను ఎదుర్కొన్నారు. ఇలా కొండా సురేఖ తరచూ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారారు.మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్‌ క్లియరెన్స్‌ చేయడం కోసం కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని, తాను ఎలాంటి డబ్బు ఆశించలేదని కొండా సురేఖ తెలిపారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాను నిజాయితీ పరులానంటూ ఆమె చెప్పుకొచ్చారు. తన లా ఎవరూ ఉండరని కూడా అన్నారు. అంటే మిగిలిన కాంగ్రెస్ మంత్రులు అవినీతి పరులు అంటూ ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు జనంలోకి వెళ్లిపోయాయి. తాను సుద్దపూసను అని చెప్పుకోవడంలో తప్పలేదు. కానీ తాను మిగిలిన మంత్రుల్లాగా ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకోవడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. తాను నిజాయితీ పరురాలనని చెప్పుకోవడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ మంత్రివర్గంలో ఉంటూ తాను ఒక్కరే ఫైళ్లు క్లియరెన్స్ కు డబ్బులు తీసుకోలేని అనడం అంటే… మిగిలిన మంత్రులకు కించపర్చినట్లేనని అంటున్నారు. ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి నాలుగున్న కోట్ల రూపాయలు ఖర్చయిందన్న కొండా సురేఖ తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో నూ ఇది చర్చనీయాంశమైంది. మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ కార్యకర్తలే ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీడియా క్లిప్పింగ్స్ ను తెప్పించుకుని చూసినట్లు సమాచారం.అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు హైకమాండ్ నుంచి ఫోన్లు రావడంతో మంత్రి కొండా సురేఖ ఎప్పటిలాగానే వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కోసం అవినీతికి పాల్పడేవారని అన్నానని, తమ ప్రభుత్వం గురించి మాట్లాడలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పటికే పార్టీని, ప్రభుత్వాన్ని బాగాడ్యామేజీ చేశాయి.
స్పందించిన కేటీఆర్
చివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, మంత్రిగా అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం కాగా.. ఈ మాటలను ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలుగా మార్చుకున్నాయి. మంత్రి కొండా సురేఖ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం అంటూ.. విమర్శలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయమై ఎక్స్ వేదికగా స్పందించారు. నిజాలు మాట్లాడినందుకు కొండా సురేఖకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమీషన్ సర్కారు నడుస్తోందని, ఈ కమీషన్ ప్రభుత్వంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఫైళ్ల మీద సంతకాలు పెట్టరని సహచర మంత్రులే చెబుతున్నారని.. ట్వీట్ చేశారు. ఆ కమీషన్ మంత్రులు పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సురేఖ క్లారిటీ..
వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలు వైరల్ కావడం, దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో.. మంత్రి కొండా సురేఖ స్పందించారు. హనుమకొండ రాంనగర్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి, తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకుని పనులు చేశారని చెప్పారు. తాను కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా పని చేసిన నేతలు.. సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండని హితవు పలికారు. మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత పెరిగాయో.. ఎంక్వైరీ చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.
బద్నాం చేస్తున్నారు..
తాను మాట్లాడిన దాంట్లో పూర్తి వీడియో ప్రసారం చేయకుండా.. ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంతను కొండంతలుగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు మాత్రమే అందాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని, ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతుంటే విష ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు సెక్రటేరియట్ ను చెడగొట్టి పోయారని.. ప్రతి చిన్న ఫైల్ కి డబ్బులు తీసుకునే తీరుగా మార్చారని ఆరోపించారు. మంత్రులు తప్పు చేశారంటూ చేస్తున్న ట్రోలింగ్ ఆపకపోతే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు.
మీకు ఆస్తులెలా వచ్చాయి..?
తాము ఏం మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు భూతుగా చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తాను మంత్రులెవరైనా అని మాట్లాడానని, కానీ కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా అనలేదని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్, కవితకు ఇంత పెద్దమొత్తంలో ఆస్తులెలా వచ్చాయని ప్రశ్నించారు. ఇల్లే లేదని చెప్పిన కవితకు.. అంత పెద్ద భవనం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఫామ్ హౌజ్ ఎలా వచ్చిందని నిలదీశారు. అవినీతికి పాల్పడకపోతే అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడి, కాంగ్రెస్ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్