- Advertisement -
లగచర్ల రైతుల కేసులు ఎత్తి వేయాలి
The cases of Lagacharla farmers should be dropped
నర్సంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి వెంటనే విడుదల చేయాలని బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం నర్సంపేట, నియోజక వర్గం వ్యాప్తంగా అన్నిమండలాల్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాను సారం నర్సంపేటలో నిరసన కార్యక్రమం చేపట్టమని ఓ డీ సి ఎం ఎస్ ఛైర్మెన్ గుగులోటు రామస్వామి తెలిపారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్భందించడంతో పాటు, రైతుల చేతులకు బేడీలు వేయడం బాధాకరం అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట కౌన్సలర్స్, పార్టీ నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -