ప్రజల పక్షాన నిలిచే యోధుడి క్యారెక్టర్

- Advertisement -

ప్రజల పక్షాన నిలిచే యోధుడి క్యారెక్టర్
హైదరాబాద్, జూలై 3

The character of a warrior who stands on the side of the people

హరిహర వీరమల్లు ట్రైలర్ విజిల్స్ వేయించే డైలాగ్స్, సూపర్బ్ విజువల్స్… పవన్ కళ్యాణ్ మాస్ అవతార్ కుమ్మేశారు.మొఘల్ సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చలించిన ఒక యోధుడు, బందిపోటుగా మారాడతాడు. మొఘల్ చక్రవర్తికి, సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ప్రజల పక్షాన నిలిచిన యోధుడు వీరమల్లు కథ సినిమా.’హరిహర వీరమల్లు’ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. వీరమల్లుగా టైటిల్ రోల్ చేశారు పవన్. ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడటం గ్యారంటీ. ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పడ్డాయి.
హిందువుగా జీయించాలంటే పన్ను కట్టాల్సిన సమయం… ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం… ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం… అంటూ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలైంది. ‘గోల్కొండ నుంచి ఎనిమిదోవాడు బయలుదేరాడు. వాడు ఢిల్లీ చేరుకోకూడదు’ అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలు అయ్యాయి. ‘ఇది నేను రాసిన చరిత్ర. సింహాసనమా? మరణ శాసనమా?’ అంటూ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్’ అని తనికెళ్ళ భరణి డైలాగ్, పవన్ ఎంట్రీ ఒకేసారి జరిగాయి. ఆయన్ను కోహినూర్ అన్నట్టు ప్రాజెక్ట్ చేశారు. ‘దాన్ని కొట్టి తీసుకు రావడానికి తిరుగులేని రామబాణం కావాలి’ అని తనికెళ్ళ భరణి మరో డైలాగ్ చెబుతుంటే పవన్ వీరత్వాన్ని చూపించారు.’ఇప్పటి దాకా మేకల్ని తినే పుల్ని చూసి ఉంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ బావుంది. ‘నేను రావాలని చాలా మంది దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు’ అని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్. ‘ఆంది వచ్చేసింది’ అంటూ పవన్ గురించి బాబీ డియోల్ చెప్పిన డైలాగ్ మోడీ మాటను గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular