Wednesday, March 11, 2026

కూటమి ప్రభుత్వానిది ఆర్థిక విధ్వంసం.. కాగ్ రిపోర్టు బయటపెట్టిందన్న వైఎస్ జగన్

- Advertisement -

కూటమి ప్రభుత్వానిది ఆర్థిక విధ్వంసం..
కాగ్ రిపోర్టు బయటపెట్టిందన్న వైఎస్ జగన్
విజయవాడ, మార్చి 11

The Coalition Government Caused Economic Ruin:
CAG Report Has Exposed This, Says YS Jagan
తమ వైసీపీ పాలనతో పోల్చితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటూ దారుణంగా పెరిగాయి అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే రాబడుల కంటే.. ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అని ఆయన ప్రశ్నిచంరాు. “కూటమి ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసాన్ని కాగ్ కళ్లకు కట్టినట్లు చూపించింది” అని జగన్ అన్నారు.బడ్జెట్లో కల్పిత లెక్కలు, మోసాలే ఉన్నాయి అని జగన్ ఆరోపించారు. 2024-25లో 80వేల కోట్ల అప్పులు చేశారన్న జగన్.. తాము 62,719 కోట్ల అప్పులే చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 30 శాతానికి పైగా ఎక్కువ అప్పులు చేసిందన్నారు. మొదటి ఏడాదిలో సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదనీ, తమ ప్రభుత్వ పథకాలను కూడా రద్దు చేశారనీ.. అయినా ఇంతలా అప్పులు ఎందుకు అయ్యాయో గమనించాలని ఏపీ ప్రజలను జగన్ కోరారు.సీఎం చంద్రబాబు.. అప్పులను పెంచుకుంటూ పోతున్నారని జగన్ ఆక్షేపించారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్న జగన్.. ఆ తర్వాత ప్రజలకు ఏమైనా ఒరిగిందా అని ప్రశ్నించారు. “కూటమి పాలనలో ద్రవ్యలోటు అంటే.. అప్పులు.. మా ఐదేళ్లలో ఎంత తక్కువగా ఉందో, ఇప్పుడు ఎంత ఎక్కువగా ఉందో చూస్తే.. తేడా తెలుస్తుంది. మా హయాంలో కోవిడ్ ఉన్నా.. అప్పులు తక్కువగానే చేశాం” అని జగన్ అన్నారు.ఈ సంవత్సరం 2026-26లో మొదటి 10 నెలల్లో.. కూటమి ప్రభుత్వం 39.74 శాతం ఎక్కువగా అప్పులు చేసిందని జగన్ ఫైర్ అయ్యారు. ఇవన్నీ ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు అని జగన్ అన్నారు. 2025-26లో gsdpలో తెచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08 శాతం ఉందన్న జగన్.. తమ పాలనలో ఐదేళ్లలో అది యావరేజ్గా 4.11 శాతమే ఉంది అని జగన్ తెలిపారు. తాము కోవిడ్తో పోరాడి, మేనిఫెస్టోని కూడా అమలు చేస్తూ కూడా.. అప్పులు చాలా తక్కువ చేశామని జగన్ తెలిపారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో ఈ లెక్కలు నిజమైన చిత్రపటాలన్న జగన్.. ఏ రాష్ట్రమైనా.. నెట్ బారోయింగ్ సీలింగ్కి లోబడి అప్పులు తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు ప్రతీసారీ.. నెట్ బారోయింగ్ సీలింగ్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. 2014-19లో కూడా చంద్రబాబు.. NBC కంటే.. రూ.29,099 కోట్లు ఎక్కువగా అప్పులు చేశారని తెలిపారు. తమ హయాంలో 2019-24లో NBC పరిమితి కంటే.. రూ.12,780 కోట్లు తక్కువగానే అప్పులు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు రాగానే.. మళ్లీ సీన్ రివర్స్ అయ్యిందని జగన్ వివరించారుతాము ఐదేళ్లలో రూ.3లక్షల 31వేల కోట్ల అప్పులు మాత్రమే చెయ్యగా.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3,20,454 కోట్ల అప్పులు చేసిందని జగన్ అన్నారు. ఈ అప్పులు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాయం రావట్లేదన్న జగన్.. అవినీతి పెరిగిపోయిందనీ.. బినామీలు, ఎమ్మెల్యేలూ.. దోచుకో, పంచుకో, తినుకో విధానంలో దోచేస్తున్నారని జగన్ విమర్శించారు. ఇసుక, గ్రానైట్, లిక్కర్, భూములు, ఇలా ప్రతీ దానిలోనూ దోపిడీ సాగుతోందని జగన్ మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్