కాంపిటేషన్ పోటీల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
సిద్దిపేట
The collector who unveiled the poster of the competition
నూతన ఆవిష్కరణలకు ఇన్ స్పైర్ అవార్డు-మనక్ కాంపిటేషన్ పోటీలు ఒక చక్కటి వేదికగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా విద్యా శాఖ వారి ఆధ్వర్యంలో ఇన్ స్పైర్ అవార్డు-మనక్ కాంపిటేషన్ పోటిలకు సంబంధించిన గోడపత్రికను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి పాఠశాల నుండి 5 ప్రాజెక్టులను రూపొందించాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. 6వతరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను, వైజ్ఞానిక దృక్పదాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర, గణిత శాస్త్ర, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ. శ్రీనివాసరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


